ఈనెల 10 నెల అనంతపురంలో జరుగునున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు తరలిరావాలని సెట్టూరు మండలం జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు వెంకటేష్ పిలుపునిచ్చారు. సెట్టూరు మండలం లక్ష్మణ్ పల్లి లో సోమవారం వారు మాట్లాడారు. బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారన్నారు. జనసేన పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.