పార్వతీపురం మండలంలోని కవిటి భద్ర గ్రామంలో గల కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్. శ్రీనివాసరావు, నిర్మల తదితరులు టీజింగ్ పై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు శక్తి యాప్ తో పాటు పోక్సో యాక్ట్, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు వినియోగం తదితర వాటిపై అవగాహన కల్పించారు. అందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.