పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలం, కొండల రాయునిపాలెం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల కాకాని తులసీరామ్ గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్య అభ్యసిస్తున్నట్లు అరండల్ పేట ఎస్ఐ రోజా లత మంగళవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. విద్యార్థి చిల్లి రెస్టారెంట్ సమీపంలోని ఓ హాస్టల్ లో నివాసముంటున్నట్లు తెలిపారు. నిన్న అనగా 25.08.2025 సోమవారం ఉదయం 11:30 కు హాస్టల్ కి వెళ్లేందుకు అరండల్ పేట 1 వ లైనులో ఆటో ఎక్కినట్లు చెప్పారు. కానీ ఆటో ఎక్కిన విద్యార్థి హాస్టల్ కి వెళ్లలేదని తెలిపారు.