ఒక యువకుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది, అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులకు వీడియో కాల్ చేస్తూ, వారి కళ్ళముందే ఒక విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం శివార్లలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, ఎగువ పెదపల్లికి చెందిన కొర్ర అభిరామ్, చైతన్య కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 28న ఇంటికి వెళ్లి తిరిగి గురువారం కళాశాలకు వచ్చాడు.