కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మంచిగా లేదని విద్యార్థులు ఇంటికి వెళ్లి పోయారు. మల్లేపల్లి పాఠశాలలోనీ సుమారు 30 మంది విద్యార్థులు పప్పు పుల్లగా ఉందని, అన్నం సరిగా ఉడకలేదని ఇంటికి వెళ్లి పోయారు. అన్ని పాఠశాలలో కూడా మధ్యాన భోజనం తయారు చేసే వాళ్లు ఖర్చు తగ్గించాలని రుచిపచి లేకుండా కూరలు, అన్నం వండటం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనీ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు...