విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో నడిపించి అది ప్రైవేటు వారి చేతులు కు వెళ్లకుండా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చిన నిర్వాసిత నిరుద్యోగుల ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో అపోహలు పెట్టారని ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న కుట్రలో భాగమేనని అన్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ను కొనడానికి అదాని, మెటల్, పోస్కో ఇటువంటి కంపెనీలు ముందుకు వచ్చి కంపెనీని అమ్మేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఇది ఏ మాత్రం నిజం కాదని అన్నారు.