మచిలీపట్నం లో లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించారు.