Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ రావు తెలిపారు.ఈ క్రమంలో ఎం జె పి బాలుర పాఠశాల ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన,మూడు లక్షల రూపాయలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం మొక్కలు నాటినట్లు ఎమ్మెల్యే గండ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందని,ఈ నేపథ్యంలోనే ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర కొనసాగిస్తున్నామని తెలిపారు.