జనసేన పార్టీ ఈ నెల 30వ తేదీన విశాఖలో కీలక సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, నగరమంతా జనసేన జెండాలతో నిండిపోయింది. బీచ్ రోడ్, ఎయిర్‌పోర్ట్ రోడ్, ఆటోనగర్, జగదంబ జంక్షన్‌తో పాటు నగరంలోని పలు ప్రధాన రహదారులన్నీ జనసేన జెండాలతో, కటౌట్‌లతో కళకళలాడుతున్నాయి. జెండాలు, బ్యానర్లు, కటౌట్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం వల్ల నగరానికి పండుగ వాతావరణం నెలకొంది.పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు రానుండటంతో అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.