బొండపల్లి మండలం బిళ్ళలవలస జంక్షన్ లో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ విజయనగరం నుంచి ఎండుమిర్చి బస్తాల రోడ్డును ఆటోలో తీసుకుని వలస జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ చక్రాలు ఊడిపోగా ఆటో డ్రైవర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.