సంతబొమ్మాళి మండలం మేఘవరంలో సంకల్పం కార్యక్రమం పేరిట గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఎస్సై 2 రఘునాథ రావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వీటి పట్ల అవగాహన పరుచుకోవాలని వివరించారు. సెల్ఫోన్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అపరిచిత వ్యక్తులు పంపిన వాట్సాప్లు ఓపెన్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.