కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఎమ్మెల్సీ ఇసాక్ బాష విమర్శించారు. ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కు వినతి పత్రం అందజేశారు. దాదాపు 11 నెలలుగా వేతనాలు అందడం లేదని, రాష్ట్రంలో ఒక్క మసీదును కూడా అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు.