కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ కట్టాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమని ఆయన ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.