ఢిల్లీలో కాళ్ల పేరలాడుతూ ఆంధ్రలో వీధి నాటకాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మచిలీపట్నం తెదేపా నేతలు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మచిలీపట్నంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పిఎసిఎస్ అధ్యక్షులు నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని అయినప్పటికీ తగ్గుదునమ్మా అంటూ రైతు సమస్యల పేరుతో వైకాపా నేతలు రోడ్డున పడటం శోచనీయమన్నారు.