అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్జర్ ఎదుట మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఐఈడి బాంబ్ స్పెషలిస్ట్, ఎసిఎం క్యాడర్ మావోయిస్ట్ గరిదో దేవా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్ట్ పార్టీలో సీనియర్, జూనియర్ మధ్య అంతర్గత విబేధాలు, ఒక కారణం కాగా ఆక్సిడెంట్ లో తమ్ముడిని కోల్పోవడంతో తండ్రిని చూసుకునేందుకు మరో కారణమని ఆపరేషన్ సరెండర్ పాలసీ వంటి వాటిని ఆధారంగా చేసుకుని పార్టీని వీడి జనసేన స్రవంతిలో కలిశారని ఎస్పీ వెల్లడించారు. చతిస్గడ్ లో కుంట ఏరియా కమిటీ మెంబర్గా ఉన్న ఇతను పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్నారు.