నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయకచవితి కోలాహాలం మొదలైంది. గ్రామ గ్రామాన పట్టణ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన మండపాలకు బుధవారం గణనాథులను తరలిస్తున్నారు. తయారీ కేంద్రాల వద్ద ఉత్సవ కమిటీల సందడి నెలకొంది. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహ రాజ్‌కీ జై.. అంటూ అంటూ చిన్నారులు, పెద్దలు నినాదాలు చేస్తూ చిన్న వినాయకుల నుండి భారీ బొజ్జ గణపయ్యలను బాజా భజంత్రీల మధ్య వాహనాల్లో తరలించారు. ఎటుచూసిన పండుగ సందడే కనిపించింది. ప్రధాన మార్కెట్ కిటకిటలాడింది. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.