Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
ఉదయగిరి నుంచి ఆత్మకూరు వైపు బైకుపై ఉదయగిరి మండలానికి చెందిన షేక్ ఖాసిం (35), తన భార్య హజరత్ బీతో కలిసి వెళ్తున్నరు.ఆత్మకూరు మండలం, కరటంపాడు వద్ద జాతీయ రహదారిపై స్కూల్ బస్సు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఖాసిం మృతిచెందగా, హజరత్ బికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.