ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.