Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 25, 2025
రంపచోడవరం ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు వ్యక్తిగతమునకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను స్వీకరించి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించి మరికొన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కార మార్గాలు అన్వేషించి సమస్యలు పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. సోమవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం రంపచోడవరం ఐటిడిఏ పి ఓ కట్టా సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించారు