తిరుమల శ్రీవారిని గురువారం ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ తెలిపారు ఆధ్యాత్మికత ఒక్కటే ఉన్నతమైన మానవ జీవన విధానమని ఆధ్యాత్మికం వలన స్వీయ నియంత్రణ క్రమశిక్షణ సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు స్వామి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.