మన్సురాబాద్ పెద్దచెరువు ప్రాంగణాన్ని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వినాయక నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వినాయక నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో శ్రమించి నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో అంకితభావంతో పని చేశారని తెలిపారు. అధికారులందరికీ ఆయన ప్రశంసించారు.