పల్నాడు జిల్లా అచ్చంపేట మండల విద్యాశాఖ కార్యాలయం నూతనంగా నిర్మిస్తామని మీడియా తో మండల విద్యాశాఖ ఇన్చార్జి అధికారి వై ప్రసాద్ రావు మంగళవారం పేర్కొన్నారు. నూతన భవనం నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను జిల్లా అధికారులకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్ రిలీజ్ అవడంతో నూతన భవనాన్ని నిర్మించడం జరుగుతుందనీ తెలియజేయడం జరిగింది.