నల్లగొండ జిల్లా: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆదేశించారు. సోమవారం ఆమెన్ నల్లగొండ జిల్లా తిప్పర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి రిజిస్టర్ ఏఎన్ సీ,ఈడిడి రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యాసామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తాసిల్దార్ రామకృష్ణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు.