Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వం పేదల పక్షం: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Aug 27, 2025
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణ దుర్గం ప్రజావేదికలో బుధవారం బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 32 మంది బాధితులకు రూ.32.80 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పేదల కొరకు అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us