Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 22, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడకం ఈడిమే జిల్లా ఓఎస్డి జగదీష్ అడహళ్లి ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎటపాక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడకం ఇడిమే వివరాలను పాత్రికేయుల సమావేశం లో ఓఎస్డి జగదీష్ అడహళ్లి వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టు పై లక్ష రూపాయలు రివార్డు ఉన్నట్లు వైఎస్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ బేటాలియన్ అధికారులు, స్థానిక ఎస్ ఐ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.