శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అమరావతి హోటల్ సమీప జాతీయ రహదారిపై శనివారం టమాటా పళ్ళు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి వరద కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న సమీప ప్రాంత ప్రజలు ఘటన స్థలానికి చేరుకొని టమాట పళ్ళు వేరుకునేందుకు పోటీలు పడ్డారు. పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.