నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎస్.కె కైసర్, ఉపాధ్యక్షులుగా కాల్వ అశోక్, అజయ్, కోశాధికారిగా భూమేష్, ప్రధాన కార్యదర్శిగా నవీన్, సంయుక్త కార్యదర్శిగా జితేష్, సోషల్ మీడియా కన్వీనర్ గా విశాల్, టిఎంఓఏ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాచ విజేత అశ్విన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సాయి శాంతన్ రెడ్డి, సభ్యులుగా శివ ప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ లు ఎన్నుకున్నారు. మీసేవ కోసం హెల్త్ ఇన్సూరెన్స్, కనీస వేతనం వచ్చే విధంగా సీఎంతో మాట్లాడి కృషి చేస్తామని అన్నారు.