తిరుపతిలో ఆదివారం అమరావతి ఛాంపియన్షిప్ జాతీయ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవం అటహాసంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా సినీ హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. నారా రోహిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఏపీకి జాతీయస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని కోరారు యువత క్రీడల పై ఆసక్తి చూపించి ముందుకు రావాలని సూచించారు కలెక్టర్ వెంకటేశ్వర సాఫ్ట్ చైర్మన్ రవి నాయుడు తదితరులు ఇందులో పాల్గొన్నారు.