అనంత రైతు పోరు కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.