షామీర్పేట,తూముకుంట, దేవరయంజాల్ ప్రాంతాల్లోని చెరువులలో గణపతి నిమర్జనాలు కొనసాగుతున్నాయి. నేడు సుమారుగా 6 వేలకు పైగా గణపతి నిమర్జనాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు, పోలీసులు తగిన విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. పలుచోట్ల ఉదయం నుంచి గణపతి మండపాల వద్ద నిమజ్జనానికి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసుకున్నారు.