రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడంతో దిక్కు తోచని స్థితిలో వైసిపి రైతుల పేరుతో డ్రామాలు ఆడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా ఆరోపించారు. ఉల్లి రైతుల ఆత్మహత్యల పేరుతో వైసిపి నేతలు నకిలీ వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, 77 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారని తెలిపారు.సెప్టెంబర్ 10న అనంతపురంలో జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.