గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా రేవంత్ సర్కార్ ఏడిపిస్తుందని మాజీ మంత్రి సత్యవతి అన్నారు .ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పేపర్లో టీవీల్లో ఏదోచోట గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆసుపత్రుల పాలైన వార్తలు చూడవలసి వస్తుందని, అయినా ప్రభుత్వం పాలనలో మార్పు కనిపించడం లేదని అన్నారు, గురుకులాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగం చేసిందని మండిపడ్డారు.