ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా దొంగతనంగా ఇసుకను ఎవరైన తరలిస్తే కేసులు నమోదు చేసి జైలు కు పంపుతామని కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గొల్లపల్లి గ్రామానికి చెందిన మర్రి రాజశేఖర్ ట్రాక్టర్ లో అక్రమంగా, దొంగతనముగా గొల్లపల్లి శివారులోని వాగు నుండి ఇసుక తరలిస్తుండగా డ్రైవర్ ని ట్రాక్టర్ తో సహా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరల ఎటువంటి చట్ట వ్యతిరేక చేపట్టకుండా ముందస్తుగా కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ముందు హాజరు పరిచి లక్ష రూపాయల పూచికత్తు పై బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు.