ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రేణిగుంట నుంచి రాజంపేట వస్తున్న సందర్భంగా రైల్వే కోడూరు లో సిపిఐ, సిపిఎం కాంగ్రెస్ పార్టీ, సిపిఎంఎల్ పార్టీ నాయకులు ను ముందస్తు అరెస్టు చేశారు. సిపిఎం జిల్లా సమితి సభ్యులు చంద్రశేఖర్ సిపిఐ రైల్వే కోడూర్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఎన్ శాంతయ్య, సిపిఐ ఎంఎల్ సిగి అన్నయ్యలను అరెస్ట్ చేశారు.