కర్నూలు: తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముకలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు నగరంలోని అంబెడ్కర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చదువులో ప్రతిభ కనబర్చిన రజక విద్యార్థులకు ఎంపీ స్వయంగా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆదోనిలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కోరగా, ఎంపీ నాగరాజు వెంటనే స్పందించి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.తరువాత మాట్లాడిన ఎంపీ, గత వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరి