ఆదిలాబాద్ మార్కెట్ లో రోజురోజుకు డూప్లికేట్ వస్తువుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. తాజాగా ఘడీ డిటర్జెంట్ పౌడర్ మాదిరిగానే నకిలీ డిటర్జెంట్ పౌడర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ ఘడి డిటర్జెంట్ ను తీసుకువచ్చి ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్మే క్రమంలో టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారన్నారు.