కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్థు తెలియని వ్యక్తి అనారోగ్యం వల్ల మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల మేరకు నిన్నటిదినం శుక్రవారం రోడ్డుపై స్పృహ కోల్పోయి ఉన్న వ్యక్తిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్బంగా తన పేరు భాష అని ఆ వ్యక్తి తెలిపారన్నారు. మృతి చెందిన ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచారం తెలపవలసిందిగా కోరారు.