కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తుందంటూ కాళేశ్వరం జలాలతో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని బిఆర్ఎస్ నాయకులు శుభ్రం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయని, ఆ జలాలతోటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నింపి ఆనాడు కేసీఆర్ రైతులకు నీళ్లు అందించాడని, అలాంటి ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ నాయకులు అన్నారు.