శ్రావణమాసం ముగియడంతో ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్ గ్రామంలో బడుగ సంబరాలు ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయ బడుగ పండుగను ఆదివారం ఉదయం ఘనంగా గ్రామస్థులు నిర్వహించారు. గ్రామస్థులందరూ అడవి నుంచి పూజకు ఆకులను తీసుకొని సమీపంలోని వాగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాగై మాతరి, జాగే మాతరి" అంటూ నినాదాలు చేస్తూ అంటు వ్యాధులు, ఈగలు, దోమలు, అన్నీ పోవాలి అంటూ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు