నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం సాయంత్రం టెలిఫోన్ స్తంభం నేలకు ఒరిగింది. దీంతో ఆ స్తంభం పెను ప్రమాదంగా మారింది. అనేకమార్లు ప్రమాదకరంగా ఉన్న టెలిఫోన్ స్తంభం ను మార్చలని అనేకమార్లు నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించిన స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.