ఆగస్టు 3 న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించనున్న సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి జిల్లాలోద్దీన్ పిలుపునిచ్చారు. శనివారం నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మహాసభలకు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం హాజరవుతారని తెలిపారు. సిపిఐ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కోరారు.