అత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేసినందుకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, కూటమి నాయకులు, స్థానికులు అత్తిలి రైల్వే స్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురువారం సాయంకాలం 6:30 కు మంత్రి మాట్లాడుతూ కరోనా అనంతరం ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే అధికారులు పూరీ–తిరుపతి, కాకినాడ–చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అత్తిలిలో హాల్ట్ ఇవ్వడానికి అంగీకరించారని, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని వెల్లడించారు.