హాలహర్వి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయం ముందు ఎలాంటి బోర్డు లేకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, విద్యార్థినుల భద్రతకు సింగల్ గేటుకు బదులుగా డబుల్ గేటు ఏర్పాటు చేయడం వంటి విషయాలపై ఆయన మండిపడ్డారు. తక్షణమే సింగల్ గేటు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు బిగించి బాలికలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.