ఫేక్ ఓటర్ కార్డుతో తమిళనాడు మహిళను నగరి కౌన్సిలర్‌గా నాటి ఎమ్మెల్యే రోజా ఏకగ్రీవం చేయించారని TDP ఆరోపించింది. ‘ఐశ్వర్య పేరుతో తమిళనాడులో ఉంటున్న మహిళకు ఆ పేరుతో అక్కడే ఓటర్ కార్డు ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘సాయి సంధ్యా రాణి’ పేరుతో ఆమెకు ఫేక్ ఓటు కార్డు సృష్టించారు. ఆ తర్వాత కౌన్సిలర్‌గా ఏకగ్రీవం చేయించారు. YCP దొంగ వేషాలు ఇప్పుడు బయటపడుతున్నాయి’ అంటూ గురువారం Xలో TDP పోస్ట్ చేసింది.