శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని సి ఆర్ పల్లి గ్రామంలో కీరా దోసకాయ పంట షెడ్ నెట్ హౌస్ను జిల్లా కలెక్టర్ చేతన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఉద్యాన శాఖ అధికారులతో మాట్లాడి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటలను తరచూ రైతులు పర్యవేక్షించాలని అలాగే ఆదాయం వచ్చే ఉద్యాన పంటలను విస్తృతంగా సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. దీంతోపాటు ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరించి వారిని ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు.