రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు కరీంనగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్లో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహరాన్ని కారు అతివేగంగా ఢీకొందని స్థానికులు తెలిపారు. హైదరాబాదు నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు యూటర్న్ తీసుకుంటున్న బైకు ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాలిలో ఎగిరి రోడ్డుపై పడి పోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైకర్ కు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.