జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధనకు ప్రయత్నించాలని కలెక్టర్ దివాకర టీఎస్ విద్యార్థులకు సూచించారు. కన్నాయిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని, ఎలాంటి సమస్యలున్న వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.