కంది మండలం చేర్యాల జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారులు సోమవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర వివరాలు.. ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 122.85 కిలోల గంజాయిని తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాలను రీమోడలింగ్ చేసి సీట్ల కింద, డిక్కీలో ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.