గిరిజన గ్రామాల అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 63 మంది మాస్టర్ లకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.