Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పత్రిక ప్రకటన విడుదల చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు అర్బన్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేందర్ అనే ఉపాధ్యాయుడు ప్రత్యేక అధికారి వెంకట నరసయ్య పై వ్యక్తిగత విభేదాల కారణంగా ఈనెల 21న అర్థరాత్రి సమయంలో తాగు నీటి ట్యాంకులో హానికరమైన పురుగుల మందు కలపడం వల్ల 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, విద్యాశాఖ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేందర్ పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.